వాగ్దానం నెరవేరుపు కొరకు నీవు ఇంకా పోరాడుతున్నావా?

blog thumb

కొత్త సంవత్సరం లోనికి అడుగు పెట్టడానికి కొద్ది రోజులే ఉన్నాయి.2020 వాగ్దానం కొరకు ఇంకా మనలో చాలామంది పోరాడుతూనే ఉన్నాము. నీ శ్రమ, కష్టానికి తగిన వాగ్దానం పొంది ఉన్నప్పటికీ, వాగ్దానం చూడలేక ఉన్నావా?అయితే ఈ మాట నీ కోసమే......... మన అందరి జీవితాలలో దేవుడు ఒక్కడే మార్చగలిగే పరిస్థితులు,ఆయన మాత్రమే కలుగు చేసుకునే సమస్యలు ఉంటాయి.అవి అనారోగ్యO ,అవమానం ,నిరుద్యోగం, బాధ ,భయం ఆందోళన ,ఆర్థిక సమస్యలు ,నిస్సహాయత ఏదైనా కావచ్చు.

ఏదైనప్పటికీ మన జీవితాలను పునరుద్ధరించ కలిగిన నిరీక్షణతో నింప గలిగిన వాగ్దానం పొందుకోవాలి అనే ఆశ ఉంటుంది. అలాగే మారని పరిస్థితులు ,జవాబు రాని ప్రశ్నలు ఎన్నో ఉంటాయి అలాంటి సమయంలో సహనాన్ని కోల్పోతాం, అలసిపోతాం, విసుకు చెందుతాం నెమ్మదిగా వాగ్దాన నిరీక్షణ కోల్పోతాం.జీవితం భారమై పోతుంది,భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుంది.ఇలాంటి ఒక సమస్య గుండ నేను వెళ్లాను......

గత ఏడు నెలల నుండి అనారోగ్య సమస్యతో నేను బాధపడుతూ వాగ్దానం దయచేయమని ప్రార్ధించాను.'నిశ్చయముగా నీకు స్వస్థత కలుగును' అనే వాగ్దానాన్ని నేను పొందుకొన్నాను.నాకు చాలా సంతోషం కలిగింది, అద్భుతం అతి త్వరలో చూస్తాను అనే ఆశ కలిగింది.రోజులు, నెలలు గడిచిపోయాయి కానీ నేను ఈ రోజు వరకు స్వస్థత కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాను.వాగ్దానం పొందుకున్న తర్వాత ఆరోగ్యం మెరుగుపడలేదు గాని సమస్య ఎక్కువ అయింది.నేను ఆందోళన, నిరాశతో బాధపడ్డాను అలాంటి కష్ట సమయంలో దేవుని వాక్యము లోనుండి ఒక అద్భుతమైన వచనం నన్ను ఆలోచింపచేసింది.

"నా నోటనుండి వచ్చువచనము, నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును."
యెషయా 55:10,11.

ఈ వాక్యము నన్ను బలపరిచింది,నా ప్రయణంలో నేను నేర్చుకున్న విశయాలను వ్రాస్తున్నాను. నా ఆరోగ్య పరిస్థితి లో మార్పు రాక పోయినా ఆయన చేతి నీడలో ధైర్యముగా ఉన్నాను.

దేవుని నోటి నుండి వచ్చిన ఏ మాట ఫలము లేకుండా వెనక్కి మరలదు, ఆయనకి అనుకూలమైన కార్యాన్ని సఫలం చేస్తుంది.మనం అనుకున్న విధానంలోనే వాగ్దానం నెరవేరాలని అనుకుంటాం అలా జరగనప్పుడు నిరాశ , అనుమానం కలుగుతుంది.దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు.....

"నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నీ త్రోవలో నా త్రోవలవంటివి కావు,ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గములు కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపుల అంత ఎత్తుగా ఉన్నవి." యెషయా 55:8-9.

మానవుడు దేవుని ఆలోచనను అందుకోలేడు అది విడుదలైన ,వాగ్దానం నెరవేర్పు అయినా.కొన్ని సార్లు నీవు పొందుకున్న వాగ్దానం నీవు ఎదుర్కొనే పరిస్థితి ఎంతో వ్యత్యాసంగా ఉంటుంది.బహుశా స్వస్థత, విడుదల కొరకు వాగ్దానం పొందుకున్నప్పటికీ పరిస్థితి మరింత జటిలమయ్యిందా?? బాధనే అనుభవిస్తున్నావ ?? నీవు చూసిన దాని బట్టి మనుషుల మాటలను బట్టి నిరుత్సాహ పడవద్దు.దేవుని పై నమ్మిక ఉంచిన వారికి ఎన్నడూ అన్యాయం జరగదు.

"అబ్రహాము పొందుకున్న వాగ్దానం,మనుషులు సారాను గొడ్రాలు అని పిలవకుండా ఆపలేదు. యోసేపు పొందుకున్న వాగ్దానం తనని గుంటలో పడకుండా ఆపలేదు."

ఆలస్యమైనా అబ్రహము వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు,యోసేపు గాయపడిన తన కలను నెరవేర్చి దేవుడు ఐగుప్తు దేశానికి అధికారిగా నియమించాడు...

దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరిచిపోతాడా?

ధైర్యం తెచ్చుకో... అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు నీ వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తారు. నీ వాగ్దానం నెరవేర్పు కొరకు ఒక మార్గాన్ని సిద్దపరుస్తారు.ఆయన సార్వభౌమాధికారం లో మారా లాంటి నీ జీవితాన్ని మధురం గా మార్చగలడు అని నమ్మి నిశ్చింతగా ఉండు.దేవుడు నీ పరిస్థితిని మార్చి నీ ప్రయాణానికి ఒక అర్థం ఇవ్వగలడు.కొంచెం ఆలస్యమైనా , ప్రమాణం ప్రమాణమే అది కచ్చితంగా నెరవేరుతుంది.

Leave a Comment